వనపర్తి జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం 3: 00 గంటల నుంచి 4: 00 గంటల వరకు భారీ వర్షం పడింది. రోడ్లు, లోతట్టు ప్రదేశాలు చెరువులను తలపించాయి. వర్షానికి ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. రోడ్డుపై వ్యాపారాలు చేసుకునే వారికి అకస్మాత్తు వర్షం ఇబ్బందికరంగా మారింది. పాఠశాలలు, కాలేజీలు వదిలే సమయంలో వర్షం పడటంతో విద్యార్థులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.