నారాయణపేట మండలం పెరపళ్ళ గ్రామానికి చెందిన హరీష్ (27) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతి చెందినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు శనివారం సాయంత్రం తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన భీమేశ్ అనే వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకున్నట్లు చెప్పారు. భీమేశ్ కుటుంబ సభ్యులపై అనుమానం ఉందని మృతుడి తల్లి యశోదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.