మరికల్ మండలం తీలేరు గ్రామంలో గురువారం నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ డికే అరుణ పాల్గొన్నారు. మొదటి సారి గ్రామానికి వచ్చిన డికే అరుణను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆన్లైన్లో సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రధాని మోడీ అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారని అన్నారు.