సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కల్వకుర్తి మండలం కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి చివరి దశ నిర్మాణ పనులను అత్యంత వేగంగా రానున్న వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కొండారెడ్డిపల్లి లో ముఖ్యమంత్రి పర్యటన కోసం హెలిపాడ్ స్థలాన్ని సైతం కలెక్టర్ పరిశీలించారు. అభివృద్ధి పనులన్నీ దసరా లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.