నాగర్ కర్నూల్ మండలం ఎండబెట్ల గ్రామంలో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం సందర్శించారు. వరి ధాన్యం సన్న రకమా, దొడ్డు రాకమా అని గుర్తించే యంత్రంతో చేసే విధానాన్ని పరిశీలించారు. తేమశాతం పరిశీలించిన వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించేలా యేర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.