మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెరువుల్లో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఉప్పునుంతల మండలం కంసానిపల్లి మర్యాద చెరువు, లక్ష్మాపూర్ వెంకటేశ్వర్లు చెరువులో ఉచిత చేప పిల్లలను ఆయన వదిలారు. మత్స్యకారులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తున్నన్నారు.