మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో మక్తల్ మండలం చిన్న గోప్లాపూర్ గ్రామానికి చెందిన గుండ్ల అశోక్ కు సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్ రఫీ 21 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 21 వెల జరిమానా విధించారని డీఎస్పీ లింగయ్య తెలిపారు. బాధితురాలి కుటుంబానికి రూ. 5 లక్షలు ఇవ్వాలని ఆదేశించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 30. 112020 కేసు నమోదైందని చెప్పారు.