రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నియంత పాలన కొనసాగిస్తున్నారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని డీకే అరుణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సా. 6: 00 గంటల వరకే బతుకమ్మ సంబరాలు నిర్వహించాలని పోలీసులు చెప్పడంతో డీకే అరుణ స్పందించారు. బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాల అని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు.