మనిషిని సర్వశక్తుడిని చేస్తుంది యోగా అని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆమనగల్లులో ఆయన బుధవారం విద్యార్థులతో కలిసి యోగా సాధన చేశారు. అనంతరం మాట్లాడుతూ మానసిక వికాసం, శరీర దృఢత్వానికి యోగ దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజూ యోగా సాధన చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.