కల్వకుర్తి నుండి హైదరాబాద్ వెళుతున్న కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పై గురువారం కడ్తల్ మహేశ్వరం గేటు మధ్యలో ఆర్టిసి బస్సు పై దాడి చేసిన దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షులు ఎముక జంగయ్య డిమాండ్ చేశారు. ఏ కారణం లేకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం చట్టపరమైన నేరమన్నారు. ప్రయాణికులు భయపడి 100కు డయల్ చేసిన సకాలంలో పోలీసులు స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.