కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలో గురువారం అసంపూర్తిగా ఉన్న ఎల్లమ్మ దేవాలయం నిర్మాణం కోసం గోలి సుదర్శన్ రెడ్డి రూ. లక్ష విరాళం ప్రకటించారు. గుడి భక్తులు దేవాలయం వద్దకు ఆయనను పిలిపించి పూజ చేయించి సన్మానించారు. రూ. లక్ష విరాళం ప్రకటించినందుకు సుదర్శన్ రెడ్డికి కృతఙతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగయ్య, అశోక్, బాలస్వామి, కృష్ణయ్య, ఎల్లయ్య, పర్శరాములు, అల్లాజీ చెంద్రయ్య, లక్హ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.