మహబూబ్ నగర్: అమరులైన పోలీసులను స్మరించుకోవడం మనందరి బాధ్యత

52பார்த்தது
దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులు విధినిర్వహణలో అమరులైన వారి పేర్లను మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి సోమవారం స్మరించారు. జిల్లా కేంద్రంలో పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని అమరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరులైన పోలీసులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని ఈ సందర్భంగా ఎస్పీ గుర్తు చేశారు. కార్యక్రమంలో జోగులాంబ జోన్-7 డిఐజి చౌహన్, అదనపు ఎస్పీ రాములు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி