మహబూబ్ నగర్: ఒక వైపు ముసురు.. మరో వైపు చలి

72பார்த்தது
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో బుధవారం చల్లని ఈదురు గాలులు వీస్తున్నాయి. చలితో మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు వణికిపోతున్నారు. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ చిరు జల్లులు పడుతున్నాయి. మారుమూల గ్రామాలను దట్టమైన పొగమంచు కప్పేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రాబోయే ఐదు రోజులలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, చలి గాలుల తీవ్రత పెరుగుతుందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி