దేవరకద్ర: లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల కేంద్రంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో పైరవీలకు అవకాశం లేకుండా పారదర్శకంగా పార్టీలకతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందజేస్తామని అన్నారు.