మూసాపేట్ మండలం జానంపేట్, కొమ్మిరెడ్డి పల్లిలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో పడతాయని అన్నారు, ఈ సీజన్ నుండి సన్న రకం ధాన్యంపై రూ. 500 బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు, గ్రేడ్-ఎ ధాన్యానికి క్వింటాలకు రూ. 2320, సాధారణ రకానికి రూ. 2300 ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు.