మహబూబ్ నగర్: భార్యను చంపి సెప్టిక్ ట్యాంకులో పడేసిన భర్త
మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ సంఘటన ఆలస్యంగా సోమవారం బయటపడింది. ఎస్ఐ చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. భూత్పూర్ మండలం ఎల్కిచెర్లలో మారేపల్లి నారమ్మ (40)ను భర్త వెంకటయ్య హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ లో పడేసి ఏమీ తెలియనట్లే ఉన్నాడు. నవంబర్ 16న నారమ్మ కనిపించడం లేదంటూ హైదరాబాదులో ఉండే కుమారుడు భరత్ ఈ నెల 21న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు అసలు నిజం బయటపడింది.