రైతుల ఇండ్ల నిర్మాణాలకు రుణాలు ఇస్తాం: డీసీసీబీ ఛైర్మన్
రైతుల అభివృద్ధే ధ్యేయంగా సహకార సంఘం సొసైటీలు పనిచేస్తున్నాయని మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం మానోపాడు సొసైటీని సందర్శించి మాట్లాడుతూ. కర్షకమిత్ర, ఎల్టీ రుణాలతో పాటు రైతు బిడ్డలకు ఉన్నత చదువుల కోసం కూడా ప్రత్యేక లోన్లు ఇస్తున్నామన్నారు. పాస్ పుస్తకం ఉంటే ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏ రైతు అయినా ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే రుణం ఇస్తామని ఆయన తెలిపారు.