పాలమూరు జిల్లాలో రైల్వే సమస్యలను పరిష్కరించాలి: ఎంపీ అరుణ
పాలమూరు ఉమ్మడి జిల్లాలో రైల్వే సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని మహబూబ్ నగర్ ఎంపి డీకే అరుణ అన్నారు. గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల, నారాయణపేట, షాద్ నగర్ లలో ఆర్ఓబి, ఆర్. యూబి సమస్యలను, ఎంఎంటీఎస్ రైలు ఎక్సటెన్షన్ ను, కృష్ణ, మలక్ పేట్, జోగులాంబ గద్వాల స్టేషన్స్ అవశ్యకతను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.