మహబూబ్ నగర్ జిల్లాలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ శనివారం పరిశీలించారు. ఈ మేరకు దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం పెద్ద వడ్డేమాన్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.