శాస్త్రీయ పద్ధతులలో పరిశోధనలు కొనసాగాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రశాంత్ ఆత్మ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు హాజరైయ్యారు. ఆయన మాట్లాడుతూ డాటా సేకరణ పద్ధతులు రెండు రకాలుగా ఉంటాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళా యూనివర్సిటీ అధ్యాపకురాలు సబిహా షరీఫ్ పాల్గొన్నారు.