దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం కానాయపల్లిలో పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని, మదనాపూర్ మార్కెట్ యార్డులో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా కనీస మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.