అయిజ మున్సిపాలిటీ కేంద్రం రెండవ వార్డు కోట్ల వీధిలో గురువారం మహిళలు, చిన్నారులు, ఆ కాలనీ వాసులందరూ కలిసి బతుకమ్మ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకున్నారు. మన ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ, మన సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆటపాటలతో బతుకమ్మ పండుగను ప్రజలందరూ కలిసి ఆనందోత్సహలతో నిర్వహించారు.