మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి పట్ల రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 1951, మే 22న నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఇటిక్యాలలో ఆయన జన్మించాడు.TDP తరపున ఎంపీగా గెలవడంతో పాటు.. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. 4 పర్యాయాలు (1996, 1999, 2004, 2009) ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో TRS అభ్యర్థిగా నాగర్ కర్నూల్ MPగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తరువాత 2019 MP ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.