తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీని వ్యతిరేకిస్తున్న రైతులకు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలపనున్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని తన నివాసం నుండి జహీరాబాద్ కు ఆయన కారులో బయల్దేరారు. ఈ క్రమంలో ఇస్నాపూర్ వద్ద హరీష్ రావుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు.