తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, ఖమ్మం జలవిలయాలకు మానవ తప్పిదాలే కారణమని తెలిసింది. ఖమ్మంలో మున్నేరు నది బఫర్ జోన్‌ను ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. చెరువులు, నాలాలను పూడ్చి వెంచర్లు వేశారు. దీంతో వరద ఖమ్మంను ముంచేసింది. విజయవాడలో వరదలకు బుడమేరు మేజర్ డ్రెయిన్ కారణం. దీని సామర్థ్యం 10 వేల క్యూసెక్కులే. తెలంగాణలో 30 చెరువులకు గండ్లు పడి 45వేల క్యూసెక్కుల నీరు వచ్చింది. ఈ పరిస్థితికి తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చిన వరద కారణమని విశ్లేషిస్తున్నారు.