మెదక్ జిల్లా నర్సాపూర్ బస్ డిపో వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి నాలుగు ఆటోలు, ఓ కారు కాలి బూడిదయ్యాయి. ఇటీవల రవాణాశాఖ తనిఖీల్లో పట్టుబడ్డ వాహనాలను అధికారులు బస్ డిపోలో ఉంచారు. ఈ వాహనాలు మంటలకు ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.