ఘోర ప్రమాదం.. బస్సు నుజ్జునుజ్జు (వీడియో)

549பார்த்தது
AP: తిరుపతిలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్డోజర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 20 నుంచి 30 మంది వరకు గాయపడ్డారు. నాయుడుపేట-పూత్తలపట్టు రహదారిలోని తిరుపతి రూరల్ గొల్లపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி