ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని BRS ఉద్యమ బాట పట్టింది. సబ్బండ వర్ణాలను కలుపుకొని హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ పాలనపై ఉద్యమిస్తున్నారు. ఆదిలాబాద్‌లో సోమవారం రైతు భరోసాకింద రూ.15 వేలు అందజేయాలని డిమాండ్ చేస్తూ BRS ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో అదిలాబాద్ బస్టాండ్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు జోగు రామన్న అడ్డుకున్నారు.