పేలిన లారీ డీజిల్ ట్యాంక్.. తప్పిన ప్రమాదం (వీడియో)

81பார்த்தது
TG: నల్గొండ జిల్లా చిట్యాలలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. NH 65పై వేగంగా దూసుకొచ్చిన లారీ డివైడర్ ను ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంక్ పేలిపోయింది. దీంతో మంటలు వ్యాపించి లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி