ప్రణయ్ హత్యకేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో అందరూ ఆరితేరిన వారే ఉన్నారని తెలిపారు. మర్డర్‌ను ఎలా తప్పించుకోవాలనే ప్లాన్ కూడా వేశారని చెప్పారు. 'ఈ కేసు అంతా డబ్బుతో ముడిపడి ఉంది. అమృత, ప్రణయ్‌ని పెళ్లి చేసుకోవడంతో నచ్చకనే తండ్రి మారుతీ రావు హత్య చేయించారు. ఇది 600 పేజీల చార్జీషీట్.. దీన్ని చేయడానికి 9నెలలు పట్టింది. దాదాపు 10 సార్లు డ్రాఫ్ట్ చార్జీషీట్ మార్చాం' అని పేర్కొన్నారు.