తెలంగాణ శాసన సభలో ప్రభుత్వాన్ని శాంతి భద్రతలపై ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేదని, CM రేవంత్ రెడ్డి వీటికి సమాధానం చెప్పాలని BRS MLA కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇంటిపై దాడి చేసిన MLA గాంధీతో పాటు.. ఆయన అనుచరులపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే.. ప్రజల పరిస్థితేంటని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికీ గాంధీపై చర్యలు తీసుకోకపోవడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు.