ఇంజినీరింగ్ విద్యార్థులకు భారీ షాక్ తగలనుంది. తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజులు సవరించాలని కోరుతూ యాజమాన్యాలు TAFRCకి దరఖాస్తులు చేసుకున్నాయి. ఈ ప్రతిపాదనలపై TAFRC ఫిబ్రవరి 25న 157 కాలేజీల వారీగా రివ్యూ చేయనుంది. ఈ ప్రతిపాదనల ప్రకారం.. 157 కాలేజీలలో అడ్మిషన్ పొందాలంటే ఏటా లక్షన్నర నుంచి రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త టారిఫ్ 2022 2026 విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని కోరాయి.