చిలుకూరులో నాలుగేళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాలిక తండ్రి మాట్లాడుతూ.. గద్వాల నుంచి ఇక్కడికి వచ్చి పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నామన్నారు. తమ పాప బాత్రూంకి వెళ్లగా చిలుకూరుకు చెందిన కైలాశ్ పాపను ఎత్తుకెళ్ళి అత్యాచారాయత్నానికి పాల్పడ్డాడు. తమ పెద్ద పాప గమనించి సమాచారం ఇచ్చిందన్నారు. వెంటనే అతడిని పట్టుకుని చితకబాదామన్నారు. తన బిడ్డ పరిస్థితి మరో ఆడపిల్లకు రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు.