డీమార్ట్ షేర్లు సోమవారం క్షీణించాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ప్రకటించిన ఫలితాల్లో మదుపర్లను మెప్పించడంలో కంపెనీ విఫలమవడంతో ఇవాళ ఉదయం 9 శాతం మేర క్షీణించాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.27 వేల కోట్ల మేర ఆవిరైంది. సోమవారం ఉదయం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో డీమార్ట్ షేర్లు 9.46 శాతం క్షీణించి రూ.4,139కు చేరగా.. బీఎస్‌ఈలో 9.37 శాతం క్షీణించి రూ.4,143.60 వద్ద ట్రేడయ్యాయి.