కృతిమ వర్షాల కోసం ఢిల్లీ ప్రభుత్వం చర్యలు

74பார்த்தது
కృతిమ వర్షాల కోసం ఢిల్లీ ప్రభుత్వం చర్యలు
దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. నవంబర్ లో వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో ఆ నెలలో కృత్రిమ వర్షాలు కురిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర పర్యావరణ మంత్రికి లేఖ రాశామని తెలిపారు.

தொடர்புடைய செய்தி