పెట్రోల్ తక్కువ పోశారని ఫిర్యాదు చేయడంతో కస్టమర్‌పై పెట్రోల్ బంకు సిబ్బంది కర్రలతో దాడి చేశారు. యూపీలోని ఫిరోజాబాద్‌లో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి పెట్రోల్ బంకులో సిబ్బంది మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన పెట్రోల్ బంకు సిబ్బంది కర్రలు తీసుకొచ్చి అతనిపై దాడి చేశారు. చుట్టూ ప్రజలు ఉన్నా యథేచ్ఛగా అతనిపై దాడికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.