మల్కాజ్గిరి పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తోన్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సీపీఐ మద్ధతిచ్చేందుకు అంగీకరించింది. ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి తదితరులతో రేవంత్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తనకు మద్ధతివ్వాలని వారిని రేవంత్ కోరారు. సమావేశం అనంతరం తాము మల్కాజిగిరిలో రేవంత్‌రెడ్డికి మద్ధతిస్తున్నట్లు సీపీఐ ప్రకటించింది.