TG: అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ కక్ష గట్టినట్లు ప్రవర్తించడం సరికాదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. బన్నీపై కేసు చాలా చిన్నదన్నారు. భద్రతా వైఫల్యం ఉన్న విషయాన్ని పక్కనపెట్టి హీరోను మాత్రమే ప్రభుత్వం కారణంగా చూపుతోందన్నారు. ఒక తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం అనేక తప్పులు చేస్తోందని ఆరోపించారు. బన్నీ ప్రెస్‌మీట్ పెట్టడానికి వీలు లేనప్పుడు CP వీడియోలు ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు.