నిజంగా పట్టుదల ఉంటే లోపాన్ని కూడా జయించవచ్చని ఓ యువతి నిరూపించింది. మహారాష్ట్రకు చెందిన ప్రాంజల్ పాటిల్ ఇండియాలో మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న మహిళా IAS. చిన్నప్పుడే చూపు కోల్పోయినా బ్రెయిలీ, స్క్రీన్ రీడింగ్ టెక్నాలజీతో చదువుకున్నారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో పీజీ చేసి UPSCకి ప్రిపేర్ అయ్యారు. 2017లో 124వ ర్యాంకు సాధించి IASకు ఎంపికై ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.