TG: ఎమ్మెల్యే వేముల వీరేశంకు మరో అవమానం జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.ఈ మేరకు మీడియా సమావేశం ముగించుకొని వెళ్తున్న CM రేవంత్‌కు MLA వేముల స్వీట్ తినిపించేందుకు స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు. అందులోంచి ముందుగా రేవంత్ కొద్దిగా స్వీట్ తీసుకొని తిన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే తన చేతితో స్వీట్ తినిపించాలని చూడగా MLA చేతిని రేవంత్ తోశాడు. దీంతో దళిత MLA చేతితో తినడం ఇష్టం లేకే రేవంత్ ఇలా చేశారని విమర్శలు వస్తున్నాయి.