మేనల్లుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ పరామర్శించారు. జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్‌ను చూడగానే సురేఖ భావోద్వేగానికి గురయ్యారు. ఆయనను హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. అల్లు అర్జున్ కూడా సురేఖ చేతిపై ముద్దుపెట్టి మేనత్తకు ధైర్యం చెప్పారు. ఘటనకు సంబంధించిన విషయాలపై ఆమె ఆరా తీశారు.