తమ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను పకడ్బందీగా నిర్వహించామని CM రేవంత్ స్పష్టం చేశారు. సర్వే పూర్తి అయ్యాక ఇంటి యజమాని సంతకం తీసుకున్నామని చెప్పారు. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. BRS, BJP కోర్టుకు వెళ్లి కులగణన ఆపాలని చూస్తున్నాయని ఆరోపించారు. కంప్యూటర్ లోనే కాదు.. సర్వే చేసిన బండిల్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మనదాంట్లో కొందరు అతితెలివితేటలు ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.