పాలమూరు జిల్లాలోని గద్వాల రాజకీయం ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే గద్వాల్ నియోజకవర్గ బాధ్యతలు చేజిక్కించుకునేందుకు బీఆర్ఎస్కు చెందిన కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో అధిష్టానం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గద్వాల కాంగ్రెస్ లో నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయని, బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన నేతలు తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని అందుకే ఇన్ఛార్జి విషయంలో అధిష్టానం తొందరపడడం లేదనే టాక్ పార్టీలో నడుస్తోంది.