మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీ రికార్డు దిశగా దూసుకుపోతున్నారు. ఆయన ఇప్పటివరకూ 7,89,625 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్ వెనక్కు తీసుకోవడం జరిగింది. లోక్ సభ చరిత్రలో ఇప్పటివరకూ బీజేపీ నాయకురాలు ప్రీతమ్ ముండే పేరుతో 6.9 లక్షల అత్యధిక మెజార్టీ ఉంది.