దీర్ఘకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే అది అందంపై ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఈ సమయంలో శరీరంలో కార్టిసాల్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది ఒత్తిడి హార్మోన్. చర్మంపై ఉండే నూనె గ్రంథుల్ని ప్రేరేపించి ఎక్కువగా నూనెలు విడుదలయ్యేందుకు కారణమవుతుంది. దీంతో చర్మ గ్రంథులు మూసుకుపోయి ముఖంపై మొటిమలు వస్తాయి. అలాగే కళ్ల కింద వాపు, కనురెప్పలు ఉబ్బడం వంటి సమస్యలు వస్తాయట. చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు వస్తాయని అంటున్నారు.