మ్యాట్రి ‘మనీ’ మోసాలతో జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అందమైన యువతీ, యువకుల ఫోటోలతో కేటుగాళ్లు నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారని అన్నారు. పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి న్యూడ్ వీడియో కాల్స్ చేసి వాటితో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతన్నట్లు పేర్కొన్నారు. ఈలాంటి వెబ్‌సైట్లతో యువత అప్రమత్తంగా ఉండాలని, మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.