బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కోచ్ చండికా హతురుసింఘేను తొలగిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) అనూహ్య ప్రకటన చేసింది. గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 సమయంలో ఓ ఆటగాడిని చెంపదెబ్బ కొట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీబీ ప్రెసిడెంట్ ఫరూక్ అహ్మద్ ప్రకటించారు. 48 గంటల పాటు అతనిపై సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్ అనంతరం అతని కాంట్రాక్ట్ రద్దు చేయబడుతుందని వెల్లడించారు.