అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న బీఏపీఎస్ స్వామినారాయణ్ ఆలయంపై దాడి జరిగింది. ఆ దాడిని న్యూయార్క్‌లోని భారతీయ కౌన్సులేట్ ఖండించింది. ఆ హీనమైన చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా పోలీసుల్ని కోరినట్లు భారతీయ కౌన్సులేట్ పేర్కొంది. మెలివిల్లీలో ఉన్న స్వామినారాయన్ ఆలయాన్ని ధ్వంసం చేయడం ఆమోదించదగ్గ చర్య కాదు అని తెలిపింది.