తెలంగాణలోని జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణం-పోచమ్మ వాడలో ఆదివారం ఆస్తి తగదాలతో అన్నపై ఇద్దరు చెల్లెల్లు దాడికి పాల్పడ్డారు. ఇద్దరు చెల్లెలు శారద, వరలక్ష్మి కర్రలతో అన్నపై దాడి చేశారు. ఈ దాడిలో అన్న జంగిలి శ్రీనివాస్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించాడు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇద్దరు నిందితులు పట్టణ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.