బల్లులు ఊరికెనే ఇంట్లోకి రావు. మీ ఇంట్లో ఆహారం దొరికితేనే అవి ఇంట్లో దూరుతాయి. చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఉన్న ఇల్లు బల్లిని ఆహ్వానిస్తుంది. కాబట్టి బల్లులు రావద్దంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. నిమ్మ లాంటి సిట్రస్ జాతి మొక్కల వాసన కేవలం బల్లులే కాదు, ఏ పురుగులకు కూడా పడదు. కాబట్టి నిమ్మకాయ ముక్కలు, ఆకులను బల్లులు తిరిగేచోట పెడితే అవి రాకుండా ఉంటాయి. కర్పూరం వాసన కూడా బల్లులకు అస్సలు పడదు.